FbTelugu

కియా మోటార్స్ మరో 54 మిలియన్ డాలర్ల పెట్టుబడి

అమరావతి: ఏపీలో మరో 54 మిలియన్ డాలర్ల పెట్టుబడులు అదనంగా పెట్టేందుకు కియా మోటార్స్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇవాళ సీఎం వైఎస్.జగన్ ఆధ్వర్యంలో జరిగిన మన పాలన – మీ సూచనలో మరిన్ని పెట్టుబడులపై కియా ప్రకటన చేసింది.

తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి కియా ఇండియా సీఈఓ హాజరయ్యారు. రాష్ట్రంలో మరో 54 మిలియన్‌ డాలర్లు అదనంగా పెట్టుబడులు పెడుతున్నామని కియా ఇండియా సీఈవో కూక్యూన్‌ షిమ్‌ తెలిపారు. ఈ మొత్తాన్ని ఎస్‌యూవీ వెహికల్స్‌ తయారీకి ఉపయోగించనున్నట్లు తెలిపారు.

అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పలు మోడళ్ల కార్లను ఉత్పత్తి చేస్తూ దేశంలోనే కాకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రతి ఏడాది 3 లక్షల వాహనాలను కొత్తగా ఉత్పత్తి చేస్తున్నారు. 536 ఎకరాల్లో 1.1 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు.

You might also like