FbTelugu

ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహతయారీ షురూ

హైదరాబాద్: ప్రతి ఏటా ఘనంగా జరుపుకునే గణేష్ ఉత్సవాల్లో భాగంగా.. ఈ ఏడాది ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పూజ ప్రారంభమైంది. ఈ ఏడాది ఖైరతాబాద్ గణనాథుడు మహావిష్ణువు రూపంలో దర్శనమివ్వనున్నాడు. శ్రీధన్వంతరి నారాయణ మహా గణపతిగా నామకరణం చేశారు. ఒక వైపు లక్ష్మిదేవి మరో వైపు సరస్వతి దేవి విగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు. పర్యావరణ హితంగా ఖైరతాబాద్ గణ నాథున్ని మట్టితో తయారు చేసి అదే ప్రదేశంలో నిమజ్జనం చేసేలా ఏర్పాటు చేశారు.

ఈ సారి ఖైరతాబాద్ గణపతి 9 అడుగుల ఎత్తుతోనే దర్శన మివ్వనున్నాడు.
భక్తులు ఎవ్వరూ రావద్దని ఆన్ లైన్ ద్వారానే దర్శనము చేసుకోవాలని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ విజ్ఞప్తి చేసింది.

You might also like