FbTelugu

వెంటిలేటర్ పై చికిత్స… అయినా బుద్ది మారలేదు!

ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కాని సోషల్ మీడియాలో ఈ వీడియో ను చూసిన వారందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ కూడా ఇదే పాడ పని అంటూ విసుక్కుంటున్నారు.
ఎవరైనా ప్రాణం బాగా లేనప్పుడు హాస్పిటల్ కు వెళ్తే ఏదైనా ముట్టుకోవడానికి అంతగా ఇష్టపడరు. ఆరోగ్యం బాగుపడితే చాలు అనే విధంగా ప్రవర్తిస్తారు. పరిస్థితి విషమించి ఐసియులో చేర్చితే ఇక ఏం చేయకుండా అలా మంచం మీద పడుకుంటారు. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి మాత్రం తన పాత బుద్దిని పోనిచ్చుకోలేదు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న వ్యక్తి వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు. గాలి కూడా పీల్చుకోలేని స్థితిలో ఉన్న వ్యక్తి చేసిన పనికి పలువురికి కోపం తెప్పిస్తున్నది.

శరీరం పై అన్ని పైపులే ఉన్నాయి… ముక్కు మీద వెంటిలేటర్ మాస్క్ పెట్టారు. మరొకరు అతని పాదాల వద్ద నిల్చుని ఆరోగ్యాన్ని గమనిస్తున్నారు. ఇంత దుస్థితిలో ఉన్నా ఆ రోగి ఏమాత్రం బెదరకుండా తన చేతుల్లో ఖైని (తంబాకు) వేసుకుని రుద్దడం ప్రతి ఒక్కరికి కోపాన్ని తెప్పిస్తున్నది. తంబాకు తయారు చేసి నోట్లో వేసుకోవడం చూసిన పలువురు భగ్గుమంటున్నారు. చావు అంచుల్లో ఉండి కూడా చెడు వ్యసనం వదులుకోవడం లేదని, ఇంత ఘాటు వ్యసనం మారదా అంటూ పలువురు పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.