FbTelugu

కేజీఎఫ్ సీక్వెల్ మూవీ షూటింగ్ షురూ

కన్నడ స్టార్ హీరో యస్ కథానాయకునిగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ సినిమా యావత్ దేశంలో ఊహించని రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే..

ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్ గా ‘‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’’ను తీసేందుకు ఎప్పుడో రంగం సిద్ధం చేసుకున్నప్పటికీ లాక్ డౌన్ కారణంగా షూటింగులు నిలిచిపోయాయి. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతో తిరిగి మళ్లీ షూటింగులు ప్రారంభించినట్టు తెలుపుతూ.. ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఓ ఫొటో పోస్ట్ చేశారు.

You might also like