హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటనను విడుదల చేసింది. సప్లిమెంటరీ ఉత్తీర్ణులను కూడా రెగ్యూలర్ ఉత్తీర్ణులుగా గుర్తించనున్నట్టు తెలిపింది. దీనికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయాన్ని ఏజీ ప్రసాద్ హైకోర్టుకు నివేదించారు.
నిన్న హైకోర్టులో టెన్త్ పరీక్షలపై జరిగిన చర్చలో ప్రభుత్వం విద్యార్థులు ఏవైనా కారణాల వలన పరీక్షలకు హాజరు కాని వారికి మరలా పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించగా.. వారిని ఏ విధంగా పరిగణిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.