FbTelugu

7న టీఆర్ఎస్ పార్టీ కీలక భేటీ

హైదరాబాద్: టీఆర్ఎస్ భవన్ లో ఈ నెల 7వ తేదీన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి ఛైర్మన్లు, మేయర్లు, జెడ్పీ ఛైర్మన్లను ఆహ్వానించారు.

ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల నియామకం పై చర్చిస్తారు. అదే విధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, ఏప్రిల్ 27వ తేదీన పార్టీ మహాసభ, ఇతర సంస్థాగత అంశాలపై చర్చించి తీర్మానం చేయనున్నారు. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్ అధ్యక్షత వహించనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.