FbTelugu

నేడు రైతు సంఘాలతో కీలక చర్చలు

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు గత నెల నుంచి ఆందోళనలు చేపడుతున్నారు. కేంద్రంలో అనేక మార్లు జరిపిన చర్చలు విఫలం కావడంతో రైతులు, రైతుసంఘాల నేతలు తమ నిరసనలు కొనసాగిస్తున్నారు.

తాజాగా ఇవాళ మరోమారు రైతు సంఘాల నేతలతో కేంద్రం మరోమారు చర్చలు జరపనుంది. ఇవాళ మధ్యాహ్నం 2:00 గంటలకు కేంద్రంతో రైతు సంఘాల నేతలు సమావేశం కానున్నారు. చర్చలు జరపాలంటూ.. కేంద్ర వ్యవసాయ కార్యదర్శికి సంయుక్త కిసాన్ మోర్చా లేఖ రాసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.