FbTelugu

స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు

అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం నుంచి మూడు రోజుల వ్యవధిలో రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ముఖ్య కార్యదర్శి అధికారి కలిసి చర్చించాలని ఆదేశించింది.
ప్రభుత్వ అభిప్రాయాన్ని స్పష్టం చేయాలని, చర్చలు జరపాలని గతంలోనే ఆదేశించిన హైకోర్టు ఈసారి డెడ్ లైన్ విధించింది.

ప్రభుత్వ పిటీషన్ ను కొట్టేసిన హైకోర్టు, గతంలో ఇచ్చిన ఆదేశాలను మరోసారి స్పష్టం చేసింది. తాజా ఆదేశాలు అందిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల్లోపు ముగ్గురు అధికారులను నిమ్మగడ్డ రమేష్ కుమార్ వద్దకు పంపించాలని ఆదేశించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.