FbTelugu

సీఎం కేజ్రీవాల్ కు ఏమీలేదు

ఢిల్లీ: సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కరోనా సోకలేదు. ఇవాళ ఆయన కరోనా టెస్టు చేయించుకున్నారు. నమూనాలు పరీక్షించిన వైద్యులు నెగెటివ్ అని నివేదిక ఇచ్చారు.

రెండు రోజులుగా ఆయన తీవ్ర జ్వరం, జలుబుతో బాధపడుతున్నారు. కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో రెండు రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉన్న ఆయన ఇవాళ నమూనాలు ఇచ్చి పరీక్షలు చేయించుకున్నారు. నెగెటివ్ రిపోర్టులు రావడం ఆప్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.

You might also like