FbTelugu

హోం ఐసోలేషన్ బాగా పనిచేస్తోంది: కేజ్రీవాల్

ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి తీవ్రంగా పెరిగిపోతుండడంతో ఆస్పత్రులు సరిపోవడం లేదు. ఈ తరుణంలో హోం ఐసోలేషన్ విధానం బాగా పనిచేస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

తాను చాలామంది కరోనా బాధితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నట్టు తెలిపారు. హోం ఐసోలేషన్ విధానం బాగా పనిచేస్తోందని, ఈ విధానాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ వ్యతిరేకించవద్దని కోరారు. ఢిల్లీలో వెంటనే ఈ విధానాన్ని పునరుద్ధరించాలని కేజ్రీవాల్ ఆదేశించారు.

You might also like