FbTelugu

ఢిల్లీలో పడకల కొరత: సిఎం కేజ్రివాల్

న్యూఢిల్లీ: గడచిన వారం రోజులుగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతున్నాయి. కేసుల సంఖ్యను ఆసరాగా చేసుకున్న ప్రైవేటు హాస్పిటళ్లు డబ్బులు దండుకునేందుకు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయి.

ప్రైవేటు హాస్పిటళ్లలో మంచాలు దొరకడం లేదంటూ పలువురు సిఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో కూడా లభ్యం కావడం లేదంటూ గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకల సంఖ్యను పెంచేందుకు సిఎం చర్యలు చేపట్టారు. బెడ్స్ విషయంలో ప్రజలందరూ సహకరించాల్సిందిగా కోరారు. ప్రతి ఒక్కరూ కరోనా మార్గదర్శకాలను పాటించాలి. అవసరమైతే తప్ప ఆస్పత్రులకు వెళ్లొద్దని సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.