న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రైతులు చేపట్టిన ఆందోళనలకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్ధతు తెలిపారు. ఈ సందర్భంగా ఇవాళ కేజ్రీవాల్ నిరసన దీక్ష చేపట్టనున్నారు.
రైతులకు దేశం మొత్తం అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రైతులు, రైతు సంఘాల నేతలు నూతన రైతు చట్టాలపై కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు పూర్తిగా విఫలం కావడంతో రైతులు తన ఆందోళనలు కొనసాగిస్తన్న విషయం తెలిసిందే.