FbTelugu

సెల్ఫ్ ఐసోలేషన్ లో కేజ్రీవాల్

ఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. గత రెండు రోజులుగా కేజ్రీవాల్ జలుబు, జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు.

రెండు రోజులు అయినా తగ్గకపోవడంతో మంగళవారం నాడు కరోనా టెస్టులు చేయించుకోవాలని నిర్ణయించారు. ఆరోగ్యంగా లేకపోవడంతో రెండు రోజుల పాటు ఆయన విధులకు దూరంగా ఉన్నారు. మరో రెండు రోజుల పాటు అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.

You might also like