FbTelugu

‘నా గర్భానికి కారకున్నే పెళ్లి చేసుకుంట’ !: కీర్తి

keerthi-sensational-coments-on-balreddy

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తల్లిని హత్య చేసిన కూతురు కేసులో ప్రధాన నిందితురాలు కీర్తి తాను ఎవరి వల్ల అయితే గర్భం దాల్చిందో.. అతడినే పెళ్లి చేసుకుంటానని తెలిపింది. పోలీసుల విచారణలో పలు విషయాలు వెల్లడించిన కీర్తి.. తన పెళ్లికి సంబంధించి కూడా మాట్లాడినట్టు సమాచారం. తాను గర్భం దాల్చడానికి కారణమైన బాల్‌రెడ్డినే పెళ్లాడతానని చెప్పుకొచ్చింది. మేజర్ కాకముందే.. బాల్‌రెడ్డికి ఆకర్షితురాలై అతడికి శారీరకంగా దగ్గరైంది. దీంతో గత సెప్టెంబరులో గర్భం దాల్చింది. మెడికల్ షాపునకు వెళ్లి ప్రెగ్నెన్సీ కిట్ తెచ్చుకుని పరీక్ష చేసుకుంది. అందులో పాజిటివ్ అని తేలింది. ఆ సమయంలో బాల్‌రెడ్డి బెంగళూరులో ఉండడంతో ఏం చేయాలో కీర్తికి పాలుపోలేదు. తన ఇంటికి సమీపంలోనే ఉండే శశికుమార్ గుర్తొచ్చాడు. తాను అన్నయ్యా అని పిలిచే శశికుమార్ తనకు సాయం చేస్తాడని భావించి విషయం అతడికి చెప్పింది. సానుకూలంగా స్పందించిన శశికుమార్ తన ఇంటికి ల్యాబ్ సిబ్బందిని పిలిపించి కీర్తికి పరీక్షలు చేయించాడు. ఈ పరీక్షల్లో ఆమెకు నాలుగో నెల అని తేలింది. ఈలోగా బాల్‌రెడ్డి హైదరాబాద్ రావడం, శశికుమార్ సాయంతో ఆమన్‌గల్లో అబార్షన్ చేయించడం జరిగిపోయాయి. ఈ వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న శశికుమార్.. బ్లాక్‌మెయిల్ చేసి కీర్తిని లొంగదీసుకున్నాడు.

You might also like