FbTelugu

ధర్నాకు దిగిన కేదార్ నాథ్ పూజారులు

డెహ్రాడూన్: కేదార్ నాథ్ పూజారులు ఆలయం ముందే మూడు రోజులుగా ఆందోళన చేస్తున్న అక్కడి బిజెపి ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

తమ హక్కులను హరించేదిగా ఉన్న దేవస్థానం బోర్డును తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మూడు రోజులుగా ఆలయం ముందు పూజారులు కూర్చుని మౌన నిరసన చేస్తున్నారు. బోర్డును ప్రభుత్వం రద్దు చేయనట్లయితే తమ నిరసనలను మరింత తీవ్రతరం చేస్తామని కేదార్ నాథ్ తీర్థ్ పురోహిత్ సమాజ్ హెచ్చరించింది. ముఖ్యమంత్రి కాగానే సమస్యలు పరిష్కరిస్తానని చెప్పిన తీరథ్ సింగ్ మాట మార్చారని వారు ఆరోపించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.