FbTelugu

కొల్లు రవీంద్ర అరెస్ట్ అప్రజాస్వామికం: కేఈ కృష్ణమూర్తి

కర్నూలు: కనీసం ప్రాథమిక విచారణ లేకుండా కొల్లు రవీంద్ర అరెస్ట్ అప్రజాస్వామికమని మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో పలు విషయాలు వెల్లడించారు. వైసీపీ అసమర్థ పాలనను ప్రశ్నించే ప్రతిఒక్కరిని అక్రమ అరెస్ట్ లతో బెదరరించడమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు.

రాజకీయ జీవితంలో ఏ మచ్చ లేని కొల్లు రవీంద్రను అరెస్టు చేయడం జగన్మోహన్ రెడ్డి నియంత పోకడలకు నిదర్శనమన్నారు. నేరస్తులే పాలకులైతే నిరపరాధులంతా జైలుకు వెళతాని కొల్లు రవీంద్ర అరెస్టుతో మరోసారి స్పష్టమైందన్నారు. ఇప్పటికైనా బడుగు బలహీన వర్గాల నేతలపై కక్ష సాధింపు చర్యలను ప్రభుత్వం విడనాడాలంటూ కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.