FbTelugu

భారత్ బంద్ కు కేసీఆర్ మద్దతు

హైదరాబాద్: ఈనెల 08న రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి మద్దతు ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తీవ్ర స్థాయిలో దేశ రాజధానిలో ఆందోళనలు చేపట్టారు. అయితే ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కాకపోవడంతో రైతు సంఘాల నేతలు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు.

ఈ బంద్ లో టీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యక్షంగా పాల్గొంటాయని కేసీఆర్ తెలిపారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందునే పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను టిఆర్ఎస్ వ్యతిరేకించిందని కేసీఆర్ గుర్తు చేశారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు న్యాయమైన పోరాటాన్ని చేస్తున్నారంటూ.. కేసీఆర్ సమర్థించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.