FbTelugu

ఆర్టీసీపై కేసీ’ఆరు’ కొత్త అస్త్రం

kcr-six-sentiment-on-rtc

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ కొత్త పనైనా జాతకాలు, గ్రహాలు తదితర లెక్కలన్నీ పక్కగా చూసుకొనే ప్రారంభిస్తారు. ముహుర్తాలు, తిథులను ఎక్కువగా నమ్మే కేసీఆర్ లక్కీ నంబర్ ఆరు.. అందుకే ఆయన కీలకమైన అన్ని నిర్ణయాలను ఆ రోజే తీసుకుంటారు. తనకు కలిసి వచ్చే ఆరవ తేదీ(సెప్టెంబర్ 6)న కేసీఆర్ గత అసెంబ్లీని రద్దు చేసి.. అదే రోజు 105(1+0+5=6) మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా?.. ఆ విషయంలోకే వెళ్దాం.

అదృష్ట సంఖ్యపై ఆర్టీసీ భవిష్యత్:

సీఎం కేసీఆర్ అదృష్ట సంఖ్య ఆధారంగా ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ నిర్ణయాలు జరుగుతున్నాయా..!? మొన్న సీఎం ప్రెస్ మీట్ లో చెప్పిన లెక్కలను కాస్త లోతుగా పరిశీలిస్తే పై ప్రశ్నకు సమాధానం అవుననే అనిపిస్తోంది.

ఆర్టీసీలో 5100 ప్రయివేట్ బస్సులు తీసుకురానున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. 5+1+0+0= ‘6’

* 5వ తేదీ అర్థరాత్రి వరకు కార్మికులు విధుల్లోకి చేరాలని డెడ్ లైన్ విధించారు. తెల్లవారితే నవంబర్ ‘6’

కేసీఆర్ ఎదో కార్మికులను భయపెట్టించడానికి అద్దె బస్సులు తెస్తాం.. డెడ్ లైన్ అని అన్నాడని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ పైలెక్కలను చూస్తే కేసీఆర్ పక్కా ప్లాన్ తోనే రంగంలోకి దిగాడని అర్థం అవుతోంది. కేసీఆర్ లక్కీ నంబర్ లెక్కలు ఆర్టీసీ సమ్మె, సంస్థను ఎటు తీసుకుపోతాయో చూడాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

You might also like