FbTelugu

కేసీఆర్ రాజీనామా చేయాలి: ఎంపీ కోమటిరెడ్డి

హైదరాబాద్: పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు మొదలైన వెంటనే కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.

చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమం నిర్వహించి కేసీఆర్ విధానాన్ని ఎండగడుతామని, ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఆయన  హెచ్చరించారు. పోతిరెడ్డిపాడుపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీఓపై సీఎం కేసీఆర్ కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల ద్వారా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 6 – 8 టీఎంసీల నీటిని తరలించుకు పోయేందుకు ఏపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఏపీ తీసుకోచ్చిన జీవో 203 అమలు కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. అదే జరిగితే దక్షిణ తెలంగాణ ఏడారి అవుతోందని, పాలమూరు రంగారెడ్డి, డిండి, ఎస్ఎల్ బీసీ, ఉదయ సముద్రం ప్రాజెక్టులకు నీటి కరువు ఏర్పడుతోందన్నారు.

పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు పనులు పూర్తయితే నాగర్జున సాగర్ కు చుక్క నీరు రాదని, ఆయకట్టు రైతులు సాగు నీటి కోసం, తాగు నీటికి ప్రజలు ఇబ్బందులు పడుతారు. హైదరాబాద్ వాసులు దాహర్తితో అల్లాడే ప్రమాదం ఉందన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని తక్షణం పోతిరెడ్డి పాడు పనులను నిలిపి వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కృష్ణా బేసిన్ లో ని తెలంగాణ ప్రాజెక్టుల పనులు పూర్తయ్యేలా నిధులు కేటాయించాలని కోరారు. లేని పక్షంలో ప్రజల్లో మరోసారి సెంటిమెంట్ పెరిగే అవకాశం ఉందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.