FbTelugu

తెలంగాణలో లాక్ డౌన్ లేదు: కెసిఆర్

హైదరాబాద్: తెలంగాణలో లాక్ డౌన్ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేశారు. ఎప్పటి మాదిరే జనం సంచరించేందుకు పూర్తి వెసులుబాటు ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది.
ప్రగతి భవన్ లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం జరిగింది. లాక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను మంత్రి మండలి ఆదేశించింది.

తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకంటే వేగంగా కరోనా నియంత్రణలోకి వచ్చిందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అందచేసిన నివేదికల ఆధారంగా నిర్దారించింది. జూన్ 19 వరకు అమల్లో వున్న లాక్ డౌన్ ను రేపటి నుంచి (జూన్ 20 నుంచి) సంపూర్ణంగా ఎత్తివేయనున్నారు. అదే విధంగా అన్ని కేటగిరీల విద్యా సంస్థలను, పూర్తి స్థాయిలో జూలై 1 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. లాక్ డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా వైరస్ విషయంలో నిర్లక్ష్యం తగదని, తప్పని సరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, శానిటైజర్ ఉపయోగించడం.. తదితర కరోనా స్వీయ నియంత్రణ విధానాలను విధిగా పాటించాలని మంత్రి మండలి ప్రజలను కోరింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.