FbTelugu

నేతన్నల సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయి: కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణలో నేతన్నల సంక్షేమ కార్యక్రమాలు ఇకముందూ కొనసాగుతాయని రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ ఆయన చేనేత మరియు జౌళి శాఖపైన సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఈసారి కూడా బతుకమ్మ చీరల కార్యక్రమం కొనసాగుతుందన్నారు. నేతన్నకు చేయూత కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని క్యాబినెట్ ని కోరతామని తెలిపారు.

అలాగే వరంగల్ జిల్లా కొడకండ్లలో మినీ టెక్స్టైల్ పార్క్ ను ఏర్పాటు చేస్తామన్నారు. దీనిద్వారా కొడకండ్ల పరిసరాల్లోని 20 వేల మంది నేతన్నల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. వరంగల్ జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి మేరకు అక్కడ ఉన్న నేతన్నలకు మరింత ప్రయోజనం కల్పించే దిశగా ఒక మినీ పార్క్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. కొడకండ్ల లో పార్క్ ఏర్పాటుకు ఉన్న అనుకూల పరిస్థితుల పరిగణలోకి తీసుకొని మినీ టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.