FbTelugu

మరియమ్మ కుమారుడికి ఉద్యోగం: కెసిఆర్

హైదరాబాద్: యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ లాకప్ డెత్ చెందిన మరియమ్మ కుటుంబానికి న్యాయం చేస్తానని సిఎం కెసిఆర్ హామీ ఇచ్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలిపారు.

తెలంగాణ ఏర్పడిన తరువాత తొలిసారి సిఎం కెసిఆర్ ప్రజా సమస్యపై ఫిర్యాదు స్వీకరించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందానికి అప్పాయింట్ మెంట్ ఇచ్చారు. సిఎం అప్పాయింట్ మెంట్ ఇవ్వడంతో ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మల్లు భట్టి విక్రమార్క, తూర్పు జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు లు ప్రగతి భవన్ వెళ్లారు. మరియమ్మ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం తో పాటు, కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. బాధ్యులైన పోలీసులను కఠినంగా శిక్షిస్తానని సిఎం చెప్పారన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా, పరిస్థితులు సానుకూలంగా లేకపోవడంతో సిఎం కెసిఆర్, కాంగ్రెస్ ప్రతినిధి బృందానికి మొదటిసారి అప్పాయింట్ మెంట్ ఇచ్చారని పలువురు చర్చించుకుంటున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో దళితులపై దమనకాండ జరిగిన సందర్భంలో అప్పాయింట్ మెంట్ ఇవ్వని కెసిఆర్ ఇప్పుడెందుకు ఇచ్చారనే దానిపై పలు రకాలుగా ఊహాగానాలు వస్తున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.