FbTelugu

మీ ప్రేమ నా పై ఎల్లకాలం ఉండాలి: కేసీఆర్

హైదరాబాద్: పుట్టిన రోజు సంద‌ర్భంగా జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన నాయ‌కులు, ప్రముఖుల‌కు సీఎం కేసీఆర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మీ ప్రేమ‌, అభిమానాలు క‌ల‌కాలం కొన‌సాగాల‌ని కోరుకుంటున్నాన‌ని కేసీఆర్ పేర్కొన్నారు.

జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన వారిలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌందర రాజన్,  ముఖ్యమంత్రులు శివ‌రాజ్‌సింగ్ చౌహాన్‌, అర‌వింద్ కేజ్రివాల్‌, బీఎస్ యెడియూర‌ప్ప, విప్ల‌వ్‌దేవ్ కుమార్ త‌దిత‌రులు ట్విట్ట‌ర్ ద్వారా సీఎం కేసీఆర్‌కు బ‌ర్త్‌డే విషెస్ చెప్పారు. సినీ ప్ర‌ముఖులు చిరంజీవి, మ‌హేశ్ బాబుతో పాటు ప‌లువురు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు.

కేసీఆర్ జ‌న్మ‌దినం పుర‌స్క‌రించుకొని పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ర‌క్త‌దాన శిబిరం నిర్వ‌హించారు. కోటి వృక్షార్చ‌న కార్య‌క్ర‌మంలో భాగంగా రాష్ర్ట వ్యాప్తంగా భారీ సంఖ్య‌లో మొక్క‌లు నాటారు. ఈ కార్య‌క్ర‌మంలో రాజ‌కీయ నాయ‌కులు, సినీ ప్ర‌ముఖులు, సామాజిక‌వేత్త‌లు, హ‌రిత ప్రేమికులు, విద్యార్థులు పాల్గొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.