FbTelugu

రెవెన్యూ సమస్యలను వెంటనే పరిష్కరించాలి:కేసీఆర్

హైదరాబాద్: రాష్ట్రంలో రెవెన్యూకు సంబంధించిన అన్నిరకాల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఆయా సమస్యలపై ఇవాళ మంత్రులు, కలెక్టర్లతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు, ఆయాశాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధరణి పోర్టల్ లో అవసరమైన అన్నిరకాల మార్పులు, చేర్పులను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

9వ తరగతి నుండి ఆపై తరగతులను ఫిబ్రవరి 1వ తేదీ నుండి నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. కరోనా వ్యాక్సినేషన్ కోసం ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలన్నారు. అడవుల పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అలాగే అన్నిశాఖల్లో వెంటనే పదోన్నతులు, ఖాళీలన్నీ ఒకేసారి వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. అన్ని పట్టణాల్లో జనాభాకు అనుగుణంగా సమీకృత మార్కెట్లు, వైకుంఠ ధామాలు నిర్మించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.