FbTelugu

లాక్ డౌన్ పొడగింపుపై కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా నివారణకు లాక్ డౌన్ పై సడలింపులు, పొడగింపు అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. గ్రీన్ జోన్లలో ప్రజారవాణా, వలస కూలీల సమస్యలపై చర్చించనున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ లో రోజురోజుకి పెరిగిపోతున్న కరోనా కేసులు, కరోనా టెస్టులపై కూడా చర్చించనున్నారు. టెన్త్ పరీక్షల నిర్వహణ, పరిశ్రమలు తెరవడం వంటి అంశాలపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. కలెక్టర్లు, వ్యవసాయ అధికారులతో చర్చించనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.