FbTelugu

ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, రైతుల సమస్యలపై ఇవాళ అధికారులతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కాకుండా చూడాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా వ్యవసాయ, పౌరసరఫరాలపై సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో పలు చోట్ల రైతులు ధాన్యం తగలబెట్టి, ధర్నాలకు దిగిన సంగతి తెలిసిందే. అదే విధంగా రైతు సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష కూడా చేశారు. పలు చోట్ల ధాన్యంలో తేమ, తాలు పేరుతో మిల్లర్లు భారీగా కోతలు విధిస్తున్నట్టు రైతులు వాపోతున్నారు. ఈ తరుణంలో రైతు సమస్యలపై సీఎం సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమస్యలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

You might also like