FbTelugu

ఆర్టీసీ తాజా పరిస్థితిపై కేసీఆర్ సమీక్ష

KCR-review-of-RTCs-latest-situation

హైదరాబాద్: ఆర్టీసీలో చేరికలకు విధించిన డెడ్ లైన్ ముగియడం, కార్మికుల చేరికలు స్వల్పంగా ఉండడంతో తాజా పరిణామాలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ సమీక్ష చేస్తున్నారు. మంగళవారం అర్థరాత్రి వరకు విధించిన డెడ్ లైన్ గడువు ముగిసినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 487 మంది సిబ్బందికి మించి చేరలేదు. స్వల్ప సంఖ్యలో చేరడం, రేపు హైకోర్టులో కేసు విచారణ ఉండడంతో ఏం చేయాలనే దానిపై సీఎం మంత్రులు, అధికార వర్గాలతో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరుపుతున్నారు. మరోవైపు అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆర్టీసీని, ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.

You might also like