FbTelugu

పీవీ మన తెలంగాణ ఠీవీ: కేసీఆర్

దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించిన వ్యక్తి పీవీ

హైదరాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న భారత దేశాన్ని తన ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని గట్టెక్కించిన వ్యక్తి పీవీ నరసింహరావు అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇవాళ దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా పీవీ గురించి కేసీఆర్ పలు విషయాలను ప్రజలతో పంచుకున్నారు.

ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, గెలుపోటముల్లో గంభీరమైన వ్యక్తి పీవీ అని అన్నారు. తాను ఏరంలో ప్రవేశిస్తే ఆ రంగంలో మంచి సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు. తన 800 ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించిన మహోన్నత వ్యక్తి అన్నారు. నిరంతర విద్యార్థి పీవీ అని, పీవీ వ్యక్తిత్వాన్ని వర్ణించడానికి మాటలు చాలవన్నారు.

You might also like