FbTelugu

దృష్టి మళ్లించేందుకే కేసీఆర్ నాటకం: బండి సంజయ్

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్, దుబ్బా ఉప ఎన్నికల ఫలితాల నుంచి జనం దృష్టి మళ్లించేందుకు సీఎం కేసీఆర్ వ్యవసాయ చట్టాల గురించి మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.
రైతుల మంచి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలపై లేనిపోని అపోహలు కల్పిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఆయన చెప్పినట్లు రైతులు పంటలు వేయాలి, కాని కేంద్రం రైతుల కోసం చట్టం తీసుకువస్తే మాత్రం తప్పవుతుందా అని సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో 30 లక్షల ఎకరాల్లో సన్నరకం వరి వేయించిన సీఎం, తన ఫామ్ హౌస్ లో మాత్రం దొడ్డు వరి పండిస్తున్నారి బండి సంజయ్ ఆరోపించారు.

సీఎం కేసీఆర్ కు నిరసనలపై పిలుపుఇచ్చేందుకు సిగ్గుందా అని మాజీ మంత్రి డికె.అరుణ ధ్వజమెత్తారు. భారత్ బంద్ కు మద్దతిస్తున్న రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. బీజేపీ ని రాజకీయంగా ఎదుర్కోలేకనే కేసీఆర్ రైతుల ముసుగులో కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని బీజేపీ ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు డా. కె.లక్ష్మణ్ విమర్శించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.