FbTelugu

ఆ ముగ్గురు నేతలకు కేసీఆర్ ఫోన్

హైదరాబాద్: నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకు షెడ్యూలు విడుదల కావడంతో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక కోసం సమాలోచనలు మొదలు పెట్టాయి. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

రెడ్డి కులానికి చెందిన వ్యక్తికి సీటు ఇవ్వాలని టీఆర్ఎస్ అధిష్ఠానం భావించినప్పటికీ యాదవ కులం నుంచి వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో వెనకడుగు వేసింది. నర్సింహ్మయ్య యాదవ కులానికి చెందిన వ్యక్తి కావడంతో అదే కులానికి చెందిన వారికి టికెట్ ఇచ్చేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి చెందిన మన్నె రంజిత్ యాదవ్, పెద్దబోయిన శ్రీనివాస్ యాదవ్, కట్టెబోయిన గురువయ్య యాదవ్ లతో కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. పార్టీ పరిస్థితి ఎలా ఉంది, టికెట్ ఇస్తే ఎలా గెలిపిస్తారు, ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ముగ్గురు నేతల బయోడేటాలను కూడా తెప్పించుకున్నారు.
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ బలంగా ఉన్నప్పటికీ యాదవ కులం వాళ్లు గెలుపోటములలో కీలకంగా ఉన్నారు. వీరిని కాదని అభ్యర్థిని ఎంపిక చేసే పరిస్థితిలో కేసీఆర్ లేరు. జిల్లాకు చెందిన మంత్రి జి.జగదీశ్ రెడ్డి మాత్రం తన కులానికి చెందిన నాయకుడిని నిల్చోబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఇప్పటికే పలువురు యాదవ నాయకులు సీఎం కేసీఆర్ చెవిలో పడేశారు. నోముల నర్సింహ్మయ్య కుమారుడు భరత్ కు వేరే అవకాశం కల్పించనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.