FbTelugu

నేడు ఎల్బీస్టేడియంలో కేసీఆర్ బహిరంగ సభ

హైదరాబాద్: నేడు ఎల్బీస్టేడియంలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు టీఆర్ఎస్ శ్రేణులు భారీగా హాజరు కానున్నట్టు తెలుస్తోంది. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకున్న తరుణంలో కేసీఆర్ మీటింగ్ సర్వత్రా ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇప్పటికే సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ పూర్తి అయినట్టు తెలుస్తోంది. బహిరంగ సభ నేపథ్యంలో ఆ ప్రాంతంలో మధ్యాహ్నం 3:00 గంటల నుంచి రాత్రి 8:00 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.