FbTelugu

26న జిల్లా కలెక్టర్లతో కేసీఆర్‌ సమావేశం

హైదరాబాద్‌: జిల్లా కలెక్టర్లతో ఈ నెల 26వ తేదీన సిఎం కెసిఆర్ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ప్రగతి భవన్‌లో శనివారం ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది.

రాష్ట్రంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలు ఏజెండాగా సిఎం సమీక్షించనున్నారు. అనంతరం అధికారులకు దిశానిర్దేశం చేస్తారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్లతో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జిల్లా, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి అధికారులు, మంత్రులు, అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. జూలై 1 నుంచి 10 వరకు పల్లెప్రగతి, పట్టణప్రగతి, హరితహారం కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.