FbTelugu

నేడు కలెక్టర్లు, మంత్రులతో కేసీఆర్ సమావేశం

హైదరాబాద్: నేడు జిల్లా కలెక్టర్లు, మంత్రులతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ల పంపిణీ, నిల్వ వంటి అంశాలపై చర్చించనున్నారు.

ఈ నెల 16 నుంచి దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అలాగే రాష్ట్రంలో విద్యా సంస్థలను పూర్తిస్థాయిలో తెరవడంపై కూడా సాధ్యాసాధ్యలపై చర్చించనున్నారు. నేటి సమావేశం ఇవాళ ప్రగతి భవన్‌లో ఉదయం 11:30 గంటలకు ప్రారంభం కానుంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.