FbTelugu

రూ.20 కోట్లతో కేసీఆర్ ఐలాండ్

కరీంనగర్ మానేరు డ్యామ్ లో ఏర్పాటు

హైదరాబాద్: కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ మధ్యలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూ.20 కోట్ల అంచనా వ్యయంతో కేసీఆర్ ఐలాండ్ అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు పర్యాటక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటికే డ్యాం దిగువ భాగంలో రూ. 551 కోట్లతో మానేరు రివర్‌ ఫ్రంట్ ఏర్పాటు కు సీఎం కేసీఆర్ అనుమతిస్తూ నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. తాజాగా డ్యాం మధ్యలో నాలుగు ఎకరాల్లో ఉన్న మైసమ్మ గుట్టపై కేసీఆర్ ఐలాండ్ పేరు తో టూరిస్టులను ఆకట్టుకునేలా అభివృద్ధి చేయనున్నారు.

కేసీఆర్ ఐలాండ్‌ను ప్రపంచస్థాయి పరిజ్ఞానంతో నిర్మించనున్నారు. ప్రతి నిర్మాణాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్ది పర్యాటకులను విశేషంగా అకట్టుకునేలా ఇప్పటికే ఇన్ఫినెట్యూడ్ డిజైన్ కంపెనీ తమ ప్రణాళికతోపాటు డిజైన్లు అందజేసింది.
-ఆధునిక హంగులతో అత్యంత విశాలంగా ఎంట్రెన్స్ లాబీ
-పూర్తిగా అద్దాలతో బాంకెట్ హాల్, మెడిటేషన్ హబ్, యూనెక్స్ పార్లర్, డబుల్‌కాట్ బెడ్స్‌ తో పాటు ఆధునిక వసతులతో ఐదు ప్రీమియం సూట్స్
-ఇండోనేషియా ఆర్కిటెక్చర్ నమూనాలో 18 వెదురు కాటేజీలు
-40 మందికిపైగా విందు చేసుకునేందుకు వీలుగా ఫ్లోటింగ్ రెస్టారెంట్
-క్యాండిల్‌ లైట్ డిన్నర్, మద్యం పార్టీల కోసం నలుమూలలా ఫ్లోటింగ్ బ్రిడ్జీలు
-సెవెన్‌ స్టార్ హోటల్‌కు మించిన సదుపాయాలతో వీవీఐపీల కోసం గుట్ట పైభాగంలో ప్రెసిడెన్షియల్ సూట్
-పిల్లలు, పెద్దలకు వేరువేరుగా స్విమ్మింగ్ పూల్స్
-రెండు ఎలివెటేడ్ బ్రిడ్జీలు
-పర్యాటకులు వివిధ సూట్స్‌కు వెళ్లడానికి కావాల్సిన లిఫ్టులు.

You might also like