FbTelugu

కేసీఆర్ పేరుకు అదిరిపోయే అర్ధం చూపిన కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ పేరుకు తనయుడు మంత్రి కేటీఆర్ అదిరిపోయే కొత్త నిర్వచనం ఇచ్చారు. ఇవాళ మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్ లోకి కేసీఆర్ నీటిని విడుదల చేసి ప్రారంభిచారు.

అనంతరం కేటీఆర్ ట్విట్టర్ లో కేసీఆర్ K కాల్వలు, C చెరువులు, R రిజర్వాయర్లు పేరు సార్థకం కాగా అంటూ.. ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ కేవలం మూడేళ్లలోనే పూర్తయిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 82 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తుకు నీటిని తరలిస్తున్నట్టు తెలిపారు.

You might also like