FbTelugu

జానారెడ్డిని గెలిపించేందుకు కేసీఆర్ తాపత్రయం

సూర్యాపేట: నాగార్జున సాగర్ లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ లో వచ్చిన ఫలితాలు నాగార్జున సాగర్ లో వచ్చే ప్రమాదముందని కేసీఆర్ కు భయం పట్టుకుందన్నారు.

ఇవాళ సూర్యాపేటలో సంజయ్ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ తరుణ్ చుగ్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. సాగర్ లో కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డిని గెలిపించేందుకు కేసీఆర్ కుయుక్తులు పన్నుతున్నారనే విధంగా సంజయ్ వ్యాఖ్యానించారు. ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ అభ్యర్థి గెలుపొందడం ఖాయమన్నారు. ఆయన ఎన్ని యాగాలు చేసినా, గుడులు కట్టినా చేసిన పాపాలు ఊరికే పోవు అని అన్నారు. తెలంగాణకు పట్టిన వాస్తు దోషం, అమరవీరుల ఉసురు కేసీఆర్ కు తగులుతున్నదని సంజయ్ అన్నారు.
దేశంలో మోదీ విజయ యాత్ర ఆగలేదని, తెలంగాణలో కూడా 2023లో బీజేపీ అధికారంలోకి వస్తుందని తరుణ్ చుగ్ అన్నారు. 1969లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు కేసీఆర్ ఎక్కడ ఉన్నారు, ఆయన స్థానం ఏంటనీ అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి రాకపోవడంతో తన స్వార్థం కోసం టీఆర్ఎస్ పార్టీని స్థాపించారన్నారు. నటుడు రాజబాబు ను మించి కేసీఆర్ నటిస్తున్నారని, సీఎం కుర్చీ, సచివాలయం ఖాళీ చేయక తప్పదని ఆయన హెచ్చరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.