FbTelugu

నేడు సూర్యాపేటకు కేసీఆర్

సూర్యాపేట: భారత్-చైనా సరిహద్దుల్లో వీరమరణం చెందిన కల్నల్ బి.సంతోష్ బాబు కుటుంబాన్ని సీఎం కేసీఆర్ ఇవాళ పరామర్శించనున్నారు.

ఇప్పటికే సంతోష్ బాబు త్యాగాన్ని గుర్తిస్తూ గౌరవసూచికంగా కేసీఆర్ రూ. 5 కోట్ల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషి కి గ్రూప్ వన్ ఉద్యోగంతో పాటు 600 చ.గజాల ఇంటి స్థలం కోరుకున్న చోట ఇవ్వనున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించిన తరువాత వీటికి సంబంధించిన పత్రాలను సంతోషికి సీఎం  స్వయంగా అందించనున్నారు.

కేసీఆర్ రాక సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో జనాలు గుమికూడకుండా పోలీసు శాఖ  చర్యలు తీసుకుంటున్నది. కల్నల్ కుటుంబం నివాసం ఉండే విద్యానగర్ కాలనీ మొత్తాన్ని సోడియం హై పో క్లోరోడ్ ద్రావణం తో మున్సిపల్ సిబ్బంది శానిటేషన్ చేశారు.

You might also like