FbTelugu

ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఆటలు సాగవు: విజయశాంతి

  హైదరాబాద్: తెలంగాణలో అతిత్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికల్లో కేసీఆర్ ఆటలు సాగవని, అందుకోసమే కేసీఆర్ ఇతర కుట్రలు పన్నేందుకు స్కెచ్ వేస్తున్నారని కాంగ్రెస్ నేత విజయశాంతి ఆరోపించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఆమె టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.

మత విద్వేషాలను రెచ్చగొట్టే ఎంఐఎం నేతల ప్రసంగాలను అరికట్టడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమైనారని అన్నారు. ఇప్పటి వరకు కేసీఆర్ ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను హైజాక్ చెయ్యడం లేదా ఎన్నికలు పూర్తయిన తర్వాత గెలిచిన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను ప్రలోభపెట్టి ఫిరాయింపులను ప్రోత్సహించే వారని అన్నారు. కానీ ఆ ఆటలు ఇప్పుడు సాగేలా లేవని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.