FbTelugu

వారణాసిలో కేసీఆర్ కుటుంబం పూజలు

లక్నో: ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు పర్యటిస్తున్నారు. రెండు రోజులు పాటు అక్కడే ఉండి పలు ఆలయాలను సందర్శించనున్నారు.

వచ్చే నెలలో ముఖ్యమంత్రిగా కేటీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారనే ఊహాగానాలు విన్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పండితుల సలహా మేరకు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ భార్య శోభ, కుమార్తె కల్వకుంట్ల కవిత తో పాటు ఇతర కుటుంబ సభ్యులు వారణాసి వెళ్లారు. ఇవాళ రేపు అక్కడే ఉండి పుణ్యక్షేత్రాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇవాళ అస్సి ఘాట్ నుంచి దశాశ్వమేధ ఘాట్ వరకు బొట్లో ప్రయాణం చేయనున్నారు. దశాశ్వమేధ ఘాట్ లో గంగా హారతి, గంగా పూజలు నిర్వహించనున్నారు. పూజల తరువాత అస్సి ఘాట్ కు బోట్లో‌ తిరుగు‌ ప్రయాణం అవుతారు. ఆ తరువాత సంకట్ మోచన్ దేవాలయాంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దేవుడికి పట్టు వస్త్రాల‌ కూడా సమర్పించనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.