FbTelugu

కెసిఆర్ కుటుంబంపై విచారణ జరగాలి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

హైదరాబాద్: ఈటల రాజేందర్ మీద విచారణ చేయడం కాదు, సిఎం కెసిఆర్ కుటుంబం మీద చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ధరణిలో కెసిఆర్, ఆయన కుటుంబం భూములు కన్పించవని ఆయన అన్నారు.
ఇవాళ జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కెసిఆర్ తో పాటు ఆయన కుమారులు కెటిఆర్, సంతోష్ కుమార్, కుమార్తె కవిత ఆస్తులపై విచారణ చేయాలని అన్నారు. తన కుమారుడు కెటిఆర్ ను సిఎం చేసేందుకు సీనియర్ నాయకులపై వేటు వేస్తున్నారని, తొలి వేటు ఈటల రాజేందర్ పై పడిందన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలు ఇప్పటి వరకు కెసిఆర్ కు హరీశ్ రావు తో పాటు ఈటల అండదండగా ఉన్నారన్నారు. కెసిఆర్ కుటుంబం కుట్రలు చేసి ఈటలను బయటకు పంపించిందని, ఆయన స్వయం కృషితో ఎదిగిన నాయకుడని అన్నారు. ఎర్రవల్లిలో కెసిఆర్ తన ఫామ్ హౌస్ కోసం భూములు గుంజుకోలేదా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
భూ కబ్జా చేశారంటూ శుక్రవారం సాయంత్రం మొదలు ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలపై టిఆర్ఎస్ పార్టీకి చెందిన టివి ఛానళ్లు, న్యూస్ పేపర్లకే ఇస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. విచారణ వివరాలను ఎప్పటికప్పుడు తెలియచేయడం అన్యాయమన్నారు. రంగారెడ్డి జిల్లా జన్వాడలో కెటిఆర్ ఫామ్ హౌస్ భూములపై విచారణ చేయకుండా హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారన్నారు. కార్మిక శాఖ మంత్రి సి.మల్లారెడ్డి భూ దందాలపై ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈటల రాజేందర్ పదవి కోసం బానిసగా ఉండే నాయకుడు కాదని, ప్రజల వాయిస్ ను నిత్యం విన్పిస్తాడని అన్నారు. ఉద్యమంలో మొదటి నుంచి పనిచేశాడు కాబట్టే ఆయన పోరాడుతున్నారని, బంగారు తెలంగాణ బ్యాచ్ మాదిరి కెసిఆర్ కు భజన కొట్టలేదని జీవన్ రెడ్డి ఎధ్దేవా చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.