హైదరాబాద్: భారత్-చైనా సరిహద్దు గాల్వన్ లోయ ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షనలో తెలంగాణ ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందాడు. అతని కుటుంబానికి కేసీఆర్ రూ.5 కోట్ల సాయం ప్రకటించారు.
అదేవిధంగా సంతోష్ బాబు భార్యకు గ్రూప్-1 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి, ఇండ్ల స్థలం కేటాయింటనున్నట్టు తెలిపారు. కల్నల్ సంతోష్ బాబు స్వస్థలమైన సూర్యాపేటకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వెళ్లి వీటిని అందించనున్నట్టు ప్రకటించారు. అలాగే సరిహద్దు ఘర్షణలో వీరమరణం పొందిన మరో 19 మంది భారత సైనికులకు కూడా ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్టు తెలిపారు.