FbTelugu

కేసీఆర్ కు చీమకుట్టినట్టైనా లేదు: రేవంత్

హైదరాబాద్: రాష్ట్రంలో ‘కరోనా కల్లోలంతో ప్రజలు చస్తున్నా, కోర్టులు తిడుతున్నా, నిపుణులు హెచ్చరిస్తున్నా సిఎం కేసీఆర్ కు చీమకుట్టినట్టైనా లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

‘ఎవడి పిచ్చి వాడికి ఆనందం’ అన్నట్టుగా కేసీఆర్ వైఖరి ఉందన్నారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారిని గాలికి వదిలేసి సచివాలయంపై 11 గంటల సుదీర్ఘ సమీక్ష చేయడం సీఎం బాధ్యతారాహిత్యానికి పరాకాష్ఠ అని రేవంత్ రెడ్డి విమర్శించారు. నూతన సచివాలయంలో కార్యాలయాలు, పేషీలు, అంతస్తుల విస్తీర్ణాలపై చర్చ జరిగిందని చెప్పారు.

మూడు రోజుల్లో సచివాలయం అంశంపై మరో సమావేశంలో సీఎం పాల్గొననున్నారని ఆరోపించారు. ప్రగతిభవన్‌లో కేసీఆర్ నిన్న మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 11 వరకు సుదీర్ఘ సమావేశం జరిపారని రేవంత్ ట్వీట్ చేశారు.

You might also like