FbTelugu

రాష్ట్ర భూములకు కేసీఆర్ పట్టాదారు కాదు: బట్టి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని భూములకు కేసీఆర్ పట్టాదారు కాదని, రైతులు తమ వసతుల్పి బట్టి సాగు చేస్తారని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పలు వ్యాఖ్యలు చేశారు. కరోనా విషయంలో కుట్ర జరుగుతోందని కేసీఆర్ అంటున్నారని..

కుట్ర జరుగుతుంటే ఫామ్ హౌజ్ లోనే ఉన్నారా అంటూ ప్రశ్నించారు. ఆ కుట్రదారులెవరో భయటపెట్టాలన్నారు. మూడు నెల్లుగా పైసా పనిలేకుండా ఉన్న సామాన్య ప్రజలకు వచ్చిన కరెంటు బిల్లులపై వడ్డీ వసూలు చేయడమేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలు కరెంటు బిల్లులు కూడా కట్టలేని స్థితిలో ఉన్నారని అన్నారు. మూడు నెలలు కరెంటె చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

You might also like