FbTelugu

ప్రతి డివిజన్ కు కేసీఆర్ రూ.5 కోట్లు పంచారు: సంజయ్

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఏకైక లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రతి డివిజన్ కు రూ.5 కోట్లు పంపిణీ చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.

నగర ఓటర్లు ఈ విషయాన్ని గమనించాలని, అభివృద్ధి చేసే అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. వరద సాయం కోసం మంజూరు చేసిన రూ.500 కోట్లలో సగం సొమ్ము టీఆర్ఎస్ కార్యకర్తల జేబుల్లోకి పోయిందన్నారు. గెలుస్తామని చెబుతున్న సీఎం కేసీఆర్ డివిజన్ కు రూ.5 కోట్ల చొప్పన ఎలా పంపారో సమధానం చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు.

పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్థానీలు అక్రమంగా నివాసం ఉంటున్నారని, వారిని మజ్లిస్ పార్టీ కాపాడుతోందని, టీఆర్ఎస్ ప్రభుత్వం వెల్లగొట్టడం లేదని ఆయన ఆరోపించారు. గ్రేటర్ మేయర్ పీఠం కైవసం చేసుకున్న మరుక్షణమే పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేపడ్తామని మరోసారి ఆయన స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నాయకులు ఇచ్చే డబ్బులు తీసుకోవాలని, ఓటు మాత్రం బీజేపీకి వేయాలని బండి సంజయ్ ఓటర్లకు పిలుపునిచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.