FbTelugu

ప్రగతి భవన్ కు కేసీఆర్ దూరం

హైదరాబాద్: సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు పరిమితం కానున్నారు. అధికారిక నివాసం ప్రగతి భవన్ లో 30 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ సోకింది.
ప్రగతి భవన్ సురక్షితం కాదని వైద్యులు సలహా ఇవ్వడంతో రెండు వారాల పాటు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉండాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. భద్రతా సిబ్బందితో పాటు వ్యక్తిగత సిబ్బందికి సోకింది. దీంతో ప్రగతి భవన్ మొత్తం హైపో క్లోరినేషన్ చేశారు. ఫామ్ హౌస్ లో కూడా ఎవరినీ అనుమతించడం లేదని, అత్యవసరం అయితే ఫోన్ ద్వారా సంభాషించాలని ఆదేశాలు వెళ్లాయి.

మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఎవరు కూడా ఎర్రవల్లి రావద్దని సీఎం కేసీఆర్ మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. రెండు వారాల క్రితం బేగంపేట మెట్రో రైలు భవన్ లోని సీఎం కార్యాలయంలో ఇద్దరికి పాజిటివ్ సోకింది. మూడు రోజుల పాటు ఆఫీసు మూసివేసి హైపోక్లోరినేషన్ చేసిన విషయం తెలిసిందే.

You might also like