న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు రోజుల ఢిల్లీ పర్యటన ఇవాళ్టితో ముగిసింది. కేసీఆర్ ఢిల్లీ పర్యటనను ముగించుకొని హైదరాబాద్ కు బయలు దేరారు. గత రెండ్రోజులుగా..
కేసీఆర్ ఢిల్లీలో పర్యటించారు. తన పర్యటనలో భాగంగా.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా ఇతర కేంద్ర మంత్రులను కలిశారు. ఈ పర్యటనలో రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలు, పరిణామాలపై చర్చించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన ఆరు విమానాశ్రయాలు, ఇతర అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.