FbTelugu

కేసీఆర్ దిగజారుడు రాజకీయం: విష్ణువర్ధన్

అనంతపురం: సముద్రంలో కలిసిపోయే నీటిని వాడుకుంటుంటే అడ్డుకోవడం తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్రా ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు.

పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ ప్రాంత ప్రజలకు కనీసం సాగునీరు తాగునీరు కాకుండా కుట్రచేస్తున్నారని ఆరోపించారు. గోదావరి జలాల విషయంలో కేసీఆర్ మోసపూరిత వైఖరి నేడు స్పష్టంగా బయటపడిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకు వెళ్ళాల్సందేనన్నారు.

ఆంద్ర ముఖ్యమంత్రి రాయలసీమ ప్రజల తరఫున పోతిరెడ్డి పాడు విషయంలో ముందడుగు వేయాలన్నారు. ఈ విషయంలో రాజకీయాలకతీతంగా జగన్మోహన్ రెడ్డి కి అన్ని పార్టీలు సమర్థించాలని కోరారు. కేసీఆర్ మరోసారి రాయలసీమ ద్రోహిగా మారిపోయారు.రాయసీమకు అన్యాయం చేయబోతున్న కేసిఅర్ అలోచన తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన కేసీఆర్ కు (అనంతపురం జిల్లా ఇన్చార్జి మంత్రి గా ) రాయలసీమలో కరువు గురించి తెలియదా అని అడుగుతున్నా?. కేసీఆర్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల కోసం కాదు రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుందని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.

 

You might also like