FbTelugu

లాక్ డౌన్ పై కెసిఆర్ దే నిర్ణయం: హోం మంత్రి

హైద‌రాబాద్‌: రాష్ట్రంలో కరోనా తీవ్రత ఉందని, లాక్ డౌన్ పెట్టాలా వద్దా అనేది సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకుంటారని హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ తెలిపారు.

మహమూద్ అలీ బుధవారం నాడు లక్షీకాపూల్ లోని తన కార్యాలయంలో, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్త, డిజిపి ఎం.మహేందర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ లతో సమీక్ష జరిపారు. త్వరలో  కరోనా ఉధ్ధృతిపై సిఎం కెసిఆర్ సమీక్ష నిర్వహిస్తారని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ చెప్పారు. సమీక్ష తర్వాత లాక్‌ డౌన్‌పై నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌ డౌన్‌ పెట్టడం సిఎంకు ఎంతమాత్రం ఇష్టం లేదని అన్నారు. పరిస్ధితులను దృష్టిలో ఉంచుకుని దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. లాక్‌డౌన్‌ వల్ల ఆర్ధిక ఇబ్బందులు చాలా వస్తాయి.. దీన్ని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు లేవన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.. అదే స్థాయిలో మరణాలు జరుగుతున్నాయి. కరోనా కేసులను అసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు బ్లాక్ మార్కెట్ దందా విచ్చలవిడిగా చేస్తున్నారన్నారు. ఆక్సిజన్ నుంచి రెమిడెసివిర్ ఇంజక్షన్ వరకూ బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారన్నారు. బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను  ఆదేశించామని మహమూద్ అలీ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.