FbTelugu

కేసీఆర్ సమీప బంధువులు కిడ్నాప్!

* అర్ధరాత్రే ఛేదించిన పోలీసులు
హైదరాబాద్: నిన్న రాత్రి నగరంలోని బోయిన్‌పల్లిలో కేసీఆర్ సమీప బంధువులు కిడ్నాప్‌నకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి అర్ధరాత్రిలోపే కిడ్నాప్ నకు గురైన వారిని గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు(51), అతని ఇద్దరు సోదరులు సునీల్‌రావు(49), నవీన్‌రావు(47) లను నిన్న రాత్రి 7:30 గంటల సమయంలో కొందరు దుండగులు సినీ ఫక్కీలో ఐటీ అధికారులమంటూ.. కిడ్నాప్ చేశారు. బంధువుల ఫిర్యాదు మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు రంగంలోకి దిగి ముగ్గురినీ సురక్షితంగా వికారాబాద్ లో గుర్తించినట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.