FbTelugu

చండీ హోమం పూర్ణాహుతిలో కేసీఆర్ దంపతులు

సిద్దిపేట: కొండపోచమ్మ ఆలయంలో నిర్వహించిన చండీహోమం పూర్ణాహుతిలో సీఎం కేసీఆర్‌ దంపతులు పాల్గొన్నారు. ఈ తెల్లవారుజామున 4:30 గంటలకు స్థానిక సర్పంచ్‌ రజిత – రమేశ్‌, ఆలయ చైర్మన్‌ ఉపేందర్‌ రెడ్డి చండీహోమం నిర్వహించారు.

ఈ హోమంలో కేసీఆర్‌, ఆయన భార్య శోభ పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనానంతరం పండితులు..  సీఎం దంపతులకు వేదాశ్వీరచనం చేసి తీర్థప్రసాదాలు అందించారు. ఆ తర్వాత హోమ నిర్వాహకులు కేసీఆర్‌కు అమ్మవారి జ్ఞాపికను అందజేశారు.

పూర్ణాహుతి ముగిసిన అనంతరం కేసీఆర్‌ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి బయల్దేరి వెళ్లారు. ఉదయం 9: 35 గంటలకు తన సొంత ఖర్చులతో నిర్మించనున్న ఎర్రవల్లి రైతు వేదికకు సీఎం భూమిపూజ చేశారు. 9: 45 గంటలకు మర్కుక్ లో రైతు వేదికకు భూమి పూజ చేశారు. ఉదయం 10 గంటల సమయంలో మర్కూర్‌ పంప్‌హౌస్‌ వద్ద నిర్వహించే సుదర్శనయాగం పూర్ణాహుతిలో కేసీఆర్‌ దంపతులు, త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌ స్వామీ పాల్గొంటారు.

ఉదయం 11:30 గంటలకు మర్కూక్‌ పంప్‌హౌస్‌ను ప్రారంభిస్తారు. ఉదయం 11:35 గంటలకు కొండపోచమ్మ జలాశయం వద్ద గోదావరి జలాలకు హారతి ఇస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు మర్కూక్‌ మండల కేంద్రంలోని వరదరాజస్వామి దేవాలయంలో సీఎం పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమావేశం నిర్వహిస్తారు.

You might also like